డొమెస్టిక్ వర్కర్స్ కోసం మూడు కొత్త సర్వీసులు ప్రారంభం

- December 27, 2021 , by Maagulf
డొమెస్టిక్ వర్కర్స్ కోసం మూడు కొత్త సర్వీసులు ప్రారంభం

యూఏఈ: డొమెస్టిక్ వర్కర్స్(గృహ కార్మికులు) కు సంబంధించి మూడు కొత్త సర్వీసులను మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. ఓనర్లు తమ వద్ద పనిచేసే వర్కర్స్ రెసిడెంట్ దరఖాస్తులను పూర్తి చేయడంలో సహాయపడతాయని పేర్కొంది.రెసిడెంట్స్ వీసాల పునరుద్ధరణ, రద్దుపై దృష్టి పెడతాయని తెలిపింది. పరారీలో ఉన్నవారి కేసులను మంత్రిత్వ శాఖకు నివేదించడానికి కొత్త సర్వీసులు అనుమతిస్తాయని MoHRE వెల్లడించింది.

సేవలను ఇలా ఉపయోగించాలి:

  • మీ ఎమిరేట్స్ ID, పుట్టిన తేదీని ఉపయోగించి MoHRE యాప్‌కి సైన్ ఇన్ చేయండి.
  • గుర్తింపు, పౌరసత్వం కోసం ఫెడరల్ అథారిటీలో నమోదు చేసుకున్న తర్వాత, మీ ఫోన్‌కు OTP వస్తుంది.
  • మీ ఫైల్ కింద నమోదిత డొమెస్టిక్ వర్కర్ ని ఎంచుకోవాలి.వారి సంబంధిత డేటాను నమోదు చేయాలి.
  • ఫీ చెల్లించి, దరఖాస్తును పంపిన తర్వాత, చెల్లింపు రసీదు, వర్కర్ కాంట్రాక్ట్ కాపీతో మీకు ఈమెయిల్ వస్తుంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com