చెన్నై విమానాశ్రయంలో భారీగా డైమండ్స్ పట్టివేత..
- December 29, 2021
చెన్నై: చైన్నై విమానాశ్రయంలో భారీగా డైమండ్స్‌ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు.ఓ దుబాయ్ ప్రయాణీకుడి వద్ద నుంచి 5.76 కోట్ల విలువ చేసే వజ్రాలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.ఆ ప్రయాణికుడిని అరెస్టు అధికారులు అరెస్టు చేశారు.కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా వజ్రాలను ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో దాచి, వజ్రాలను దాచిన ట్రాలీ బ్యాగ్‌తో దుబాయ్‌కు వెళ్లేందుకు యత్నించిన ప్రయాణికుడు.విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల స్కానింగ్‌లో బండారం బట్టబయలైంది.
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు. కాగా ఇటీవల ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ సహా ఇతర విలువైన వస్తువులు పట్టుబడుతుండటం అటు అధికారులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ అక్రమ రవాణా ఏదో విధంగా చేయడానికి దుండగులు ప్రయత్నిస్తునే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టుల్లో మరిన్ని కట్టుదిట్టమైన భద్రత చర్యలు పాటించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







