భారత్ కరోనా అప్డేట్
- January 02, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో మరోసారి కరోనా రక్కిసి రెక్కలు చాస్తూ ప్రజలపై విరుచుకుపడుతోంది. గత 15 రోజుల క్రితం వరకు దేశవ్యాప్తంగా సుమారు 7 వేల లోపు కరోనా కేసులు నమోదయ్యేవి. అయితే ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు భారీగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దేశవ్యాప్తంగా కొత్తగా 27,553 కరోనా కేసులు రాగా, 284 మంది కరోనా బారినపడి మృతి చెందారు.
గడిచిన 24 గంటల్లో 9,249 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,22,801 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్నటి కరోనా స్థాయితో పోల్చితే నేడు 21 శాతం వరకు కరోనా కేసులు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. అయితే కోవిడ్ ఉధృతి దృష్ట్యా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు. ఢిల్లీ, మహారాష్ట్ర లలో కోవిడ్ విజృంభన భారీగా కొనసాగుతోంది.
తాజా వార్తలు
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..









