'మేజర్' మూవీ అప్డేట్

- January 04, 2022 , by Maagulf
\'మేజర్\' మూవీ అప్డేట్

హైదరాబాద్: ముంబైలోని తాజ్ హోటల్‌పై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో 'మేజర్' సినిమా రాబోతుంది. ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటించారు.

ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయినిగా నటించింది. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు.'హృదయమా' పాటను సిద్ శ్రీరామ్ పాడారు, ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 7న ఉదయం 11:07 గంటలకు చిత్ర బృందం విడుదల చేయనున్నారు. GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A+S మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com