మహేష్ బాబుకు కరోనా
- January 06, 2022
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు.” నా ప్రియమైన అభిమానులకు.. శ్రేయోభిలాషులకు.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నేను కరోనా బారిన పడ్డాను. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఇంట్లోనే ఐసోలేషన్ లో వైద్యుల సూచనలతో చికిత్స తీసుకుంటున్నాను. దయచేసి ఇటీవల నన్ను కలిసినవారందరు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటివరకు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోండి. అది కరోనా తీవ్రత నుంచి హాస్పిటల్ వరకు వెళ్లకుండా కొద్దిగా అయినా తప్పిస్తుంది. దయచేసి అందరు కరోనా నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి.. మళ్లీ తిరిగి రావడానికి వేచి ఉండలేను” అంటూ ట్వీట్ చేశారు. ఇక మహేష్ కి కరోనా రావడంతో ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి