మంత్రి హరీష్ రావు ని కలిసిన బాలకృష్ణ

- January 10, 2022 , by Maagulf
మంత్రి హరీష్ రావు ని కలిసిన బాలకృష్ణ

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారు నేడు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.ఈ సమావేశంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ అందిస్తున్న సేవలను, సంస్థ కార్యకలాపాలను నందమూరి బాలకృష్ణ ఆరోగ్య శాఖ మంత్రికి వివరించారు.  అంతే కాకుండా హాస్పిటల్ అభివృద్దికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి ప్రభుత్వం నుండి తగిన మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు.ఈ సమావేశంలో నందమూరి బాలకృష్ణతో పాటు డా.ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI వారు కూడా పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com