భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- January 11, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు లక్ష దాటిపోతున్నాయి.తాజాగా దేశంలో 1,68,063 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 277 మంది మృతి చెందారు.ప్రస్తుతం దేశంలో 8,21,446 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.దేశంలో ఇప్పటి వరకు 152 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.నిన్నటితో పోలిస్తే ఈరోజు 6.4 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి.అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ తో పాటు నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండటంతో కేసులు తగ్గుముఖం పట్టాయి.ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు.వారంలో ఒకటి రెండు రోజులపాటు వీకెంట్ కర్ఫ్యూలు విధించడం వలన కేసులు కొంత మేర అదుపులోకి వస్తున్నాయి.
నైట్, వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేస్తూనే వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేయడం కూడా ఇందుకు కలిసివస్తోంది.నిన్నటి నుంచి దేశంలో మూడో డోస్ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.2.75 కోట్ల మంది 60 ఏళ్లు దాటిన వారికి, కోటి మంది హెల్త్ వర్కర్లకు, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వారియర్లకు ప్రికాషనరీ డోస్‌లు వేస్తున్నారు.రెండో డోసు కింద ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో మూడో డోస్ కింద అ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.సెకండ్ డోస్ తీసుకున్న 9 నెలల తరువాత మూడో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.అయితే, 18 ఏళ్లు దాటిన అందరికి మూడో డోస్ ఇచ్చే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







