దుబాయ్‌లో ఫ్రెండ్ ను హత్య చేసిన ఆసియన్‌కు జీవితఖైదు

- January 11, 2022 , by Maagulf
దుబాయ్‌లో ఫ్రెండ్ ను హత్య చేసిన ఆసియన్‌కు జీవితఖైదు

దుబాయ్: ఫ్రెండ్ ను హత్య చేసిన ఆసియన్‌కు జీవితకాలం జైలు శిక్ష పడింది. తన సోదరితో ఎఫైర్ పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఒక ఆసియా వాసి తన తోటి స్నేహితుడిని హత్య చేశాడు. దుబాయ్ క్రిమినల్ కోర్ట్ హంతకుడికి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఆ తర్వాత దేశ బహిష్కరణను విధించింది. తీర్పును అప్పీల్ కోర్టు సమర్థించింది. ఈ కేసు గత ఏడాది ఫిబ్రవరిలో జెబెల్ అలీలోని ఇసుక ప్రాంతంలో జరిగింది. దర్యాప్తు ప్రకారం, నిందితుడు బాధితుడితో స్నేహం, వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాడు. హత్యకు రెండు రోజుల ముందు వారి మధ్య వాగ్వాదం జరిగింది. బాధితుడు తన స్వదేశంలో ఉన్న తన సోదరి ఫోన్ చేసి తనతో అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకోమని బలవంతం చేస్తున్నాడని, హంతకుడు గుర్తించిన తర్వాత ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. తన సోదరికి ఫోన్ చేయొద్దని అనుమానితుడు బాధితుడికి చెప్పినా పెడచెవిన పెట్టాడు. తన సోదరిని పదేపదే సంప్రదించడం.. నిందితున్ని మరింత రెచ్చగొట్టింది.
దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిని హత్య చేయాలనే ఉద్దేశ్యంతో ముందస్తుగా హత్య చేసినట్లు అభియోగాలు మోపింది. పక్కా ప్రణాళిక ప్రకారమే బాధితుడిని ఇసుక యార్డ్‌కు రప్పించాడని ఆరోపించింది. మొదట కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించి బహిష్కరణ విధించింది. అయితే పబ్లిక్ ప్రాసిక్యూషన్ తీర్పును అప్పీల్ చేసింది. శిక్షను కఠినతరం చేయాలని కోరింది. దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. అయితే, అప్పీల్ సెషన్‌లో బాధితుడిని ముందస్తుగా చంపాలనే ఉద్దేశాన్ని దోషి తిరస్కరించాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com