ప్రికాషనరీ క్వారంటైన్ ప్రోటోకాల్ అప్‌డేట్

- January 12, 2022 , by Maagulf
ప్రికాషనరీ క్వారంటైన్ ప్రోటోకాల్ అప్‌డేట్

మనామా: ప్రికాషనరీ (ముందు జాగ్రత్త) క్వారంటైన్ ప్రోటోకాల్ ను నేషనల్ మెడికల్ టాస్క్‌ఫోర్స్ ఫర్ కంబాటింగ్ అప్డేట్ చేసింది. కొత్త ప్రోటోకాల్ 13 జనవరి 2022 నుండి ప్రారంభమవుతుంది. బీఅవేర్ బహ్రెయిన్ అప్లికేషన్‌లో గ్రీన్ షీల్డ్‌ను కలిగి ఉన్న వ్యక్తులకు ప్రికాషనరీ క్వారంటైన్ పీరియడ్ ఏడు రోజులకు తగ్గించారు. గ్రీన్ షీల్డ్ హోల్డర్లు PCR పరీక్ష తీసుకోకుండానే ఏడు రోజుల తర్వాత క్వారంటైన్ నుండి బయటకు రావచ్చు. టీకాలు వేసుకోని వ్యక్తులు లేదా బీఅవేర్ బహ్రెయిన్ యాప్‌లో పసుపు లేదా ఎరుపు షీల్డ్‌ ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా ఇన్‌ఫెక్షన్‌కు గురైన తేదీ నుండి పది రోజుల పాటు నిర్బంధంలో ఉండాలి. టాస్క్‌ఫోర్స్ అన్ని నౌకాశ్రయాల ద్వారా బహ్రెయిన్లోకి ప్రవేశించే ప్రయాణికుల కోసం ముందుజాగ్రత్తగా నిర్బంధ ప్రోటోకాల్‌ ను అప్డేట్ చేసింది. బీఅవేర్ బహ్రెయిన్ యాప్‌లో పసుపు లేదా ఎరుపు రంగు షీల్డ్‌ను కలిగి ఉన్న వ్యక్తులు, టీకాలు వేసుకోని ప్రయాణికులు ఏడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. బీఅవేర్ బహ్రెయిన్ అప్లికేషన్‌లో గ్రీన్ షీల్డ్ పట్టుకున్న ప్రయాణికులకు ఎలాంటి నిర్బంధ నిబంధనలు వర్తించవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com