బెల్లీ డ్యాన్స్ వేసిన టీచర్..ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులు

- January 13, 2022 , by Maagulf
బెల్లీ డ్యాన్స్ వేసిన టీచర్..ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులు

కైరో: ఈజిప్టులోని దకాలియా ప్రావిన్స్‌లోని ఓ టీచర్ బెల్లీ డ్యాన్స్ వేసిందని ఆ స్కూల్ అధికారులు ఉద్యోగంలోంచి తీసేశారు.నలుగురిలోను బెల్లీ డ్యాన్స్ వేస్తావా? అంటూ ఉగ్రుడైపోయిన భర్త ఆమెకు విడాకులిచ్చాడు.దీంతో పాపం ఆ టీచర్ సరదాగా చేసిన డ్యాన్స్ తనకు తెలియకుండా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మరో టీచర్..ఫలితంగా ఉద్యోగం పోగొట్టుకుని అటు భర్త విడాకులు ఇవ్వటంతో ఆమె భవిష్యత్తుని అగమ్యగోచరంగా మార్చేసింది.

ఒక్కో దేశానికి ఒక్కో సంప్రదాయం ఉంటుంది. సంప్రదాయం అంటే ముఖ్యంగా ఆడవాళ్లే. ఆడవాళ్లు ఇది చేయకూడదు..ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి..అంటూ ఆంక్షలు విధించటం. వాటికి సంప్రదాయాలు, పద్ధతులు అనే పేరు. ఓ టీచర్ సరదాగా వేసిన బెల్లీ డ్యాన్స్ కాస్తా ఆమె ఉద్యోగం పోయేలా చేసింది. అంతేకాదు ఆమె భర్త విడాకులు ఇచ్చేలా చేసిన ఘటన ఈజిప్టులో జరిగింది. మహిళలు బహిరంగంగా డ్యాన్స్ వేయడంపై ఈజిప్షియన్ సంప్రదాయవాదుల తీవ్ర విమర్శలు సంధించారు. ఏంటీ పద్దతి పాడు లేదా? సంప్రదాయం చట్టుబండలు చేస్తున్నారు ఇటువంటివారు అంటు దుమ్మెత్తిపోశారు.ఇష్టమొచ్చినట్లుగా కామెంట్స్ తో విరుచుకుపడ్డారు. దీంతో ఆమె జీవితం ఛిన్నాభిన్నమైపోయిన పరిస్థితి ఏర్పడింది.

ఈజిప్టులోని దకాలియా ప్రావిన్స్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో అయా యూసఫ్ అనే మహిళ అరబిక్ టీచర్‌గా పనిచేస్తోంది. అయా యూసఫ్ ఓ రోజు తన సహోద్యోగులతో కలిసి నైలు నదిపై పడవలో విహార యాత్రకు వెళ్లింది.  ఆమె తనకూడా తన ముగ్గురు పిల్లలను కూడా తీసుకెళ్లింది. సరదాగా మాట్లాడుకుంటు ఛలోక్తులు వేసుకుంటూ సరదాగా సాగిపోతున్న వారి విహార యాత్రలో ఓ టీచర్ సరదాగా బెల్లీ డ్యాన్స్ వేసింది. అదే ఆమె పాలిట పెనుశాపంలా మారింది. ఆమె బెల్లీ డ్యాన్స్‌ చేస్తుండగా..తోటి ఉద్యోగి వీడియో తీశారు. అక్కడితో ఊరుకోకుండా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియో కాస్తా తెగ వైరల్ అయ్యింది. అదికాస్తా..స్కూల్ అధికారుల దృష్టికి వెళ్లటంతో ఆమెపై ఫైర్ అయ్యారు. ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఆమె షాక్ అయ్యింది. వివరణ ఇచ్చుకునే పరిస్థితి కూడా లేకుండా అయ్యింది. అంతేకాదు ఆమె భర్త కూడా మరో ఊహించని షాక్ ఇచ్చాడు.

అలా నలుగురిలోను డ్యాన్స్ వేస్తావా? నా పరువు తీసేసావు నువ్వు నాకొద్దు అంటూ విడాకులు ఇచ్చేస్తా అంటూ తెగేసి చెప్పేసరకి ఆమె నిర్ఘాంతపోయింది. ఇలా సరదాగా చేసిన డ్యాన్స్ తో ఆమెకు దెబ్బమీద దెబ్బ పడేసరికి మానసికంగా కృంగిపోయింది. తీవ్ర మనోవేదనకు గురైంది.

తన సహోద్యోగి తనకు తెలియకుండానే వీడియో తీశాని యూసఫ్ చెప్పినా వినే నాధుడే లేకుండాపోయారు. నైలు నదిలో కేవలం 10 నిమిషాల ప్రయాణం నా జీవితాన్నే అస్తవ్యస్థం చేసిందంటూ ఈజిప్టు వార్తాపత్రిక అల్ మస్రీ అల్ యూమ్‌తో  తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నేను బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ చేయలేదని వివరణ ఇచ్చుకుంది.అయినా ఎవ్వరు ఆమె వేదనను..ఆవేదనను పట్టించుకోలేదు.

టీచర్‌ యూనఫ్ విషయంలో అధికారులు తీసుకున్న నిర్ణయంపై మెజార్టీ ఈజిప్షియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తు ఇంకా ఏ కాలంలో ఉన్నారు? అనాగరికంగా ఇటువంటి నిర్ణయాలు ఏంటీ? అంటూ దుమ్మెత్తిపోతున్నారు. ఆమె ఉద్యోగం ఆమెకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యూసఫ్‌కు మద్ధతుగా ఈజిప్షయన్ మహిళలు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాగా ఆమె అనుమతి లేకుండా వీడియో తీసి..సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధిత టీచర్ సహా, ఈజిప్షయన్లు డిమాండ్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com