భారత్‌లో విజృంభిస్తున్న కరోనా..
- January 14, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకూ భారీగా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో రోజువారీ కరోనా కేసులు 2.62 లక్షలకు చేరగా, మూడు వందలకు పైగా మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్తగా 46,406 కేసులు, 36 మరణాలు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కొత్తగా 28,867 కేసులు, 31 మరణాలు నమోదు అయ్యాయి.
కర్ణాటకలో కొత్తగా 25,005 కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్లో కొత్తగా 23,467 కేసులు, 26 మరణాలు నమోదు అయ్యాయి. తమిళనాడులో కొత్తగా 20,911 కేసులు నమోదవ్వగా, 25 మంది మృతి చెందారు. ఉత్తర్ ప్రదేశ్ లో కొత్తగా 14,765 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఆరుగురు మృతి చెందారు.
కేరళలో కొత్తగా 13,468 కేసులు నమోదు కాగా, 21 మంది మృతి చెందారు.గుజరాత్లో కొత్తగా 11,176 కేసులు నమోదవ్వగా, ఐదుగురు మృతి చెందారు.రాజస్థాన్‌లో కొత్తగా 9981 కేసులు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఏడుగురు మరణించారు.
పంజాబ్ లో కొత్తగా 6083 కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు.ఏపీలో కొత్తగా 4348 కేసులు నమోద్వవగా, ఇద్దరు చనిపోయారు. తెలంగాణలో కొత్తగా 2707 కేసులు, రెండు మరణాలు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







