ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- May 05, 2024
అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలట్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పించగా..
దీని కోసం ఒక రోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి వీలుగా.. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల అభ్యర్థన మేరకు సంబంధిత అధికారులు ఒకరోజు ప్రత్యేక క్యాజువల్ సెలవును మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సూచనల మేరకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులకు తగినట్లుగా సెక్రెటేరియట్ విభాగాలు, విభాగ అధిపతులు, జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..