ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- May 06, 2024
మనామా: ఇన్వెస్ట్ స్కామ్ కేసులో బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి లోయర్ క్రిమినల్ కోర్ట్ ఒక వ్యక్తికి ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అతను BD82,000 బౌన్స్ చెక్కును జారీ చేశాడు.
వీటితో పాటు వ్యక్తులను మోసం చేయడం, దేశం నుండి పారిపోవడం ద్వారా అధికారులను తప్పించుకోవడం వంటి పలు ఆరోపణలపై కేసులను నమోదు చేశారు. 13 సంవత్సరాలకు పైగా తప్పించుకున్న తర్వాత, నిందితుడు బహ్రెయిన్‌కు తిరిగి వచ్చిన తర్వాత అరెస్టు చేశారు. పెట్టుబడి అవకాశాల ముసుగులో వ్యక్తులను మోసం చేసి, ఆ తర్వాత దేశం నుండి పరారీలో ఉన్నాడని నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూషన్ జారీ చేసిన వారెంట్ ఆధారంగా అరెస్టును అమలు చేస్తూ ఆర్థిక నేరాల నిరోధక విభాగం వేగంగా చర్యలు చేపట్టింది. సమర్పించబడిన సాక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, తగిన నిధులు లేకుండా బౌన్స్ అయిన చెక్కును జారీ చేసిన నేరానికి ప్రతివాది దోషిగా కోర్టు నిర్ధారించింది. ఇది బహ్రెయిన్ చట్టం ప్రకారం తీవ్రమైన జరిమానాలను విధించే ఉల్లంఘన అని తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..