టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా

- May 06, 2024 , by Maagulf
టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా

రియాద్: సౌదీ కార్ మార్కెట్ ప్రముఖ ఆటోమోటివ్ మార్కెట్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.ఇది ప్రపంచవ్యాప్తంగా టాప్ 20 కార్ మార్కెట్‌లలో ఒకటిగా నిలిచింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలలో అన్ని కార్ల విక్రయాలలో సగానికి పైగా మార్కెట్ సాధించింది. 2022-2023 కాలంలో సౌదీ అరేబియాలోకి 160,000 కార్లను దిగుమతి చేసుకున్నట్లు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) ఇటీవల ప్రకటించింది. 2023లోనే 93,199 కార్లు దిగుమతి చేసుకోగా, 2022లో 66,870 కార్లు దిగుమతి అయ్యాయి. ZATCA ప్రతినిధి హమూద్ అల్-హర్బీ ప్రకారం.. సౌదీ అరేబియాకు కార్లను ఎగుమతి చేస్తున్న అగ్ర దేశాలు జపాన్, భారతదేశం, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, యునైటెడ్ స్టేట్స్ మరియు థాయ్‌లాండ్ ఉన్నాయి. వాహన భద్రత పరంగా, సౌదీ స్టాండర్డ్స్, మెట్రాలజీ అండ్ క్వాలిటీ ఆర్గనైజేషన్ (SASO) 2023లో అత్యధిక సాంకేతిక మరియు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా 60,473 వాహనాలను తనిఖీ చేసినట్లు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com