శబరిమలలో మకర జ్యోతి దివ్యదర్శనం
- January 14, 2022
కేరళ: శబరిమలలో భక్తులకు మకరజ్యోతి దివ్యదర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు కొండల్లో జ్యోతి స్వరూపంలో అయ్యప్ప దర్శనమిచ్చారు. మకరజ్యోతిని దర్శనం వల్ల భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. మకరజ్యోతి దర్శనం కోసం శబరిమల భక్తజనం తరలివచ్చింది. పంబ, పులిమేడ్, నీలికల్ ప్రాంతాల్లో జ్యోతి వీక్షణకు ఏర్పాట్లు చేశారు. శబరిమలలో కోవిడ్ నిబంధనలను అధికారులు అమలు చేస్తున్నారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిచ్చారు. పంబ నుంచి సన్నిధానం వరకు అయ్యప్ప భక్తులు వేచి ఉన్నారు. ఇరుముడులతో వచ్చిన అయ్యప్పలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మకర సంక్రాంతి రోజు జ్యోతిని దర్శించుకుంటే సాక్షాత్తు అయ్యప్పస్వామి కనపడినట్లుగా భక్తులు భావిస్తారు. అందుకనే జ్యోతికి ప్రతి ఏడాది ఎక్కువగా అయ్యప్పలు వస్తుంటారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







