500 పడకల ఆసుపత్రిగా ‘అల్ఖోర్’
- June 09, 2015
అల్ఖోర్ ఆసుపత్రిని 500 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆసుపత్రి విస్తరణ పనులు జోరుగాసాగుతున్నట్లు అల్ఖోర్ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలీ అల్ జస్సిమాన్ చెప్పారు. ఇంకా ప్లానింగ్ స్టేజ్లో వుందనీ, కొత్త ఆసుపత్రిలో 500 పడకలు అందుబాటులో వుంటాయనీ, న్యూరో సర్జరీ, హార్డ్ డిసీజెస్, యాక్సిడెంట్ అండ్ ఎమర్జన్సీ కేర్ వంటి ప్రత్యేక విభాగాల్ని ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. పాత భవనాన్ని ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సహాయకుల కోసం వినియోగిస్తామని చెప్పారాయన. ఎక్స్రే, లేబరేటరీ వంటి విభాగాల్నీ విస్తరిస్తామని అన్నారు అలీ అల్ జస్సిమాన్. ఈ సంవత్సరం ఏప్రిల్ వరకూ 60 వేల మంది పేషెంట్లు వైద్య సేవల్ని తమ ఆసుపత్రిలో పొందినట్లు ఆయన వివరించారు.
--వి.రాజ్ కుమార్(ఖతార్)
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







