ఎమిరేట్స్ ఐడీ కార్డే, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్
- June 09, 2015
అతి త్వరలో ఎమిరేట్స్ ఐడీ కార్డ్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్‌లా ఉపయోగపడనుంది. దీనికి సంబంధించి ప్రక్రియ వేగవంతంగా నడుస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిరచాయి. ఐడీ కార్డ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్‌ల దుర్వినియోగాన్ని అడ్డుకోవడంతోపాటు, ఇబ్బందుల్లేకుండా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అర్హులు ఉపయోగించుకోవడానికి వీలుగా ఈ కొత్త పద్ధతిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు దుబాయ్ హెల్త్ అథారిటీ ప్రతినిథులు చెబుతున్నారు. మూడు నెలల క్రితం మొదటిసారిగా 3000 మంది సభ్యులకు ‘సాదా’ పేరుతో ఈ కొత్త ప్రక్రియను వారం రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభించారు. హెల్త్ ఇన్యూరెన్స్ సౌకర్యం పొందడానికి అనేకరకాలైన ఇబ్బందులు పడాల్సి వచ్చేదనీ, ఐడెంటిటీ ప్రూఫ్ వంటి వాటి కోసం పేషెంట్లు పడ్తున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని, కొత్తగా కార్డుల అవసరం లేకుండా ఎమిరేట్స్ ఐడీ కార్డులతోనే హెల్త్ ఇన్సూరెన్స్‌ని లింకప్ చేయడం జరిగిందని అధికారులు చెప్పారు. ఈ కొత్త విధానానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు దుబాయ్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఫండిరగ్ డాక్టర్ హైదర్ అల్ యూసఫ్. ఎమిరేట్స్ ఐడీ కార్డ్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్‌ని క్లబ్ చేయడం వల్ల పేషెంట్ మెడికల్ రికార్డ్స్‌ని డిజిటల్‌గా సేవ్ చేయడానికీ వీలు కలుగుతుందని ఐరిస్ హెల్త్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ నాయర్ చెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







