ఏపీలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు..
- January 19, 2022
అమరావతి: ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ సంఖ్య పది వేలు దాటింది. గత 24 గంటల్లో 41వేల 713 మంది శాంపిల్స్ పరీక్షించగా, పదివేల 57 మంది కోవిడ్ బారిన పడినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
ఏపీలో ఒకరోజులో పదివేలకు పైగా కేసులు వెలుగుచూడడం ఇదే తొలిసారి. కోవిడ్ వల్ల విశాఖలో ముగ్గురు.. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. మరో 1222 మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు తెలిపింది.
నిన్నటితో పోలిస్తే ఈ రోజు కోవిడ్ కేసులు మూడువేలకు పైగా పెరిగాయి. విశాఖలో అత్యధికంగా 1827 పాజిటివ్ కేసులు వచ్చాయి. చిత్తూరులో 1822, గుంటూరులో 943, తూర్పు గోదావరి జిల్లాలో 919 కోవిడ్ బారిన పడగా అత్యత్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 216 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







