టెన్నిస్ స్టార్ సానియామీర్జా రిటైర్మెంట్
- January 19, 2022
హైదరాబాద్: స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా క్రీడాభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. తాను ఇక టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడుతున్న సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. సానియా మీర్జా మాట్లాడుతూ… ఇదే తన చివరి సీజన్ అని నిర్ణయించుకున్నానని తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వచ్చిన సానియా మీర్జా ఇదే తన చివరి సీజన్ అని చెప్పింది. తన ఆటతీరుతో ఎన్నో టైటిళ్లను సాధించడంతో పాటు ప్రశంసలు దక్కించుకుంది.కెరీర్లో మహిళల డబుల్స్ ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణిగా నిలిచింది. 2001 లో సానియా మీర్జా తన కెరీర్ ను ప్రారంభించింది.
తన కెరీర్లో ఇప్పటి వరకు 6 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించింది. 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో, 2012లో ఫ్రెంచ్ ఓపెన్, 2014లో యూఎస్ ఓపెన్. మహిళల డబుల్స్‌లో 2015లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్, 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ట్రోఫీలుసాధించింది.పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను 2010లో పెళ్లి చేసుకుంది. 2018లో ఓ మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. తమ బిడ్డకు ఇజాన్ మీర్జా మాలిక్ అనే పేరును కూడా పెడుతున్నట్లు గతంలో షోయబ్ మాలిక్ ప్రకటించారు. ఇదిలా ఉంటే దేశానికి, క్రీడారంగానికి చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డ్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2006లో పద్మ శ్రీ, 2016లో పద్మ భూషన్ అవార్డ్ను పొందింది.సానియా మీర్జా చాలా కాలంగా సింగిల్స్ ఆడటం మానేసింది. డబుల్స్‌లో కూడా తన ర్యాంకు మెరుగు పడకపోవడం కూడా ఈ నిర్ణయానికి కారణం అయి ఉండొచ్చు.
ఆమె సింగిల్స్ కెరీర్లో స్వెట్లనా కుజ్నెస్టోవా, వెరా జ్వొనరెవా, మరిన్ బార్టోలి, ప్రపంచ నెం.1 ర్యాంకు సాధించిన మార్టినా హింగిస్, డినారా సఫినా వంటి క్రీడాకారిణులపై మంచి విజయాలు నమోదు చేసుకున్నారు. 2007లో సింగిల్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా 27వ ర్యాంకులో నిలిచారు. భారతదేశం నుంచి అత్యధిక ర్యాంకింగ్ కలిగిన మహిళా టెన్నిస్ క్రీడాకారిణిగా సానియా మీర్జా గుర్తింపు పొందారు. మణికట్టుకు తీవ్రమైన దెబ్బ తగలడం వల్ల సింగిల్స్‌కు దూరమయ్యరు. కానీ డబుల్స్ లో ప్రప్రంచ నెం.1 ర్యాంకు సాధించారు. తన కెరీర్‌లో అత్యధిక పారితోషకం తీసుకన్న క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది సానియా మీర్జా. మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ లోను ఆరు టైటిల్స్ గెలుచుకున్నారు. మహిళా టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్స్2014లో అర్హత సాధించడంతో పాటు టైటిల్‌ను కూడా సానియా గెలుపొందారు. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌కు చేరిన ఒపెన్ ఎరాకు చెందిన మూడవ మహిళ సానియా. ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు, ఆఫ్రో-ఆసియా క్రీడల్లో ఆమె 14 పతకాలను సాధించుకున్నారు. అందులో 6 బంగారు పతకాలు ఉన్నాయి. అక్టోబరు 2005లో టైం పత్రిక సానియాను “50 హీరోస్ ఆఫ్ ఆసియా”గా పేర్కొంది
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి