పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి..27 మందికి పైగా గాయాలు

- January 20, 2022 , by Maagulf
పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి..27 మందికి పైగా గాయాలు

లాహోర్: పాకిస్థాన్‌లో జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. లాహోర్‌లోని అనార్కలి బజార్ ప్రాంతంలో గురువారం జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు మృతి చెందగా, 27 మందికి పైగా గాయపడ్డారు.ఈ హఠాత్తు పరిణామంతో ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకున్నాయి.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మేయో ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. లాహోర్‌లోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలోని అనార్కలి బజార్‌లో గురువారం బాంబు పేలుడు జరిగింది. అనార్కలి మార్కెట్‌కు ఆనుకుని ఉన్న పాన్‌మండి సమీపంలో పార్క్ చేసిన మోటార్‌సైకిల్‌లో పేలుడు పదార్థాన్ని ఉంచినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మార్కెట్‌లో పార్క్ చేసిన మోటార్‌సైకిల్‌లో పేలుడు పదార్థాలు ఉన్నాయని, దానిపై పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. పేలుడులో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, అనేక మోటార్‌సైకిళ్లు, దుకాణాలు మంటల్లో కాలిపోతుండగా, పౌరులు భయంతో సురక్షిత ప్రాంతాలకు పారిపోతున్నారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాల అద్దాలు పగిలిపోయాయి. రెస్క్యూ బృందాలు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించగా, భద్రతా అధికారులు దర్యాప్తు కోసం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com