తెలంగాణలో ఈ నెల 31 వరకు కోవిడ్ ఆంక్షలు...
- January 20, 2022
హైదరాబాద్: కరోనా మరోసారి పంజా విసురుతోంది.ఒమిక్రాన్ ఎంట్రీతో థర్డ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతోంది.దీంతో.. అన్ని ప్రభుత్వాలు కట్టడి చర్యలకు దిగుతున్నాయి.ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా..రేపటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.మరోవైపు.. ప్రభుత్వం గతంలో విధించిన కరోనా ఆంక్షలు ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో.. కోవిడ్ ఆంక్షలు ఈ నెల 31 వరకు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక, క్రమంగా కోవిడ్ కేసుల పెరుగుతోన్న నేపథ్యంలో అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. సంక్రాంతి సెలవుల తర్వాత తిరిగి స్కూళ్లు, విద్యా సంస్థలు ప్రారంభం కావాల్సి ఉన్నా. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో..ఈ నెల 30వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే..దీంతో.. ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ లో తిరిగి బోధనను ప్రారంభించాయి.ఇక, శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఫీవర్ సర్వే ప్రారంభం కాబోతోంది.ఇప్పటికే టెస్ట్ కిట్లను, మెడికల్ కిట్లను ఆయా ప్రాంతాలకు చేరవేశారు అధికారులు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







