భారత్ కరోనా అప్డేట్
- January 21, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఎన్ని ఆంక్షలు విధించినా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం కట్టడి కావడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,47,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారంతో పోలిస్తే దాదాపు 30వేల కేసులు అధికంగా నమోదయ్యాయి. తాజాగా 703 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,85,66, 027కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 4,88,396కి చేరుకుంది.
మరోవైపు దేశంలో గడిచిన 24 గంటల్లో 2,51,777 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం 20,18,825 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 17.94 శాతానికి పెరిగింది. అటు భారత్ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య 9,692గా నమోదైంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,60,43,70,484 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 70,49,779 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







