ఒమాన్ కి సైక్లోన్‌ ముప్పు

- June 09, 2015 , by Maagulf
ఒమాన్ కి సైక్లోన్‌ ముప్పు

అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి, తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రభావం ఒమన్‌పై ఓ మోస్తరుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సముద్ర తీర వ్యాప్తంగా 36 గంటలపాటు గాలుల ప్రభావం ఉంటుందనీ, పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వారి అంచనాల ప్రకారం, తీర ప్రాంతమంతటా గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముంది. ఆకాశం మేఘావృతం కానుంది. కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయి. ‘అశూబా’గా అరేబియాలో సంభవించనున్న తుపానుకి నామకరణం చేశారు. ఒమన్‌ తీరం నుంచి పాకిస్తాన్‌, భారత్‌వైపుగా అశూబా కదులుతుండగా, ఎక్కడ తీరాన్ని దాటుతుందనేదానిపై ఇంకా వాతావరణ శాఖ ఓ అంచనాకు రాలేకపోతోంది. 36 గంటల తర్వాతే అశూబా తుపాను కదలికలపై స్పష్టత రానుంది. ఈలోగా తమ పౌరులు కాస్త అప్రమత్తంగా ఉండాలని ఒమన్‌లో వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com