హెల్త్ కేర్ వర్కర్లకు క్వారంటైన్ నుండి మినహాయింపు

- January 23, 2022 , by Maagulf
హెల్త్ కేర్ వర్కర్లకు క్వారంటైన్ నుండి మినహాయింపు

యూఏఈ: కోవిడ్-19 రోగులతో సన్నిహితంగా ఉండే దుబాయ్ హెల్త్ కేర్ వర్కర్లను తప్పనిసరి క్వారంటైన్ నుండి మినహాయించారు. దుబాయ్‌లోని కోవిడ్-19 కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ హెల్త్ కేర్ అథారిటీ (డిహెచ్‌ఎ) సర్క్యులర్‌లో తెలిపింది. హెల్త్ కేర్ ఉద్యోగులు.. కోవిడ్ లక్షణాలు లేనివారిని, రెండ డోసుల వ్యాక్సిన్, బూస్టర్ తీసుకున్నవారు, ఇంతకు ముందు కోవిడ్-19 బారిన పడ్డవారికి క్వారంటైన్ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ సర్క్యులర్ జనవరి 20, గురువారం నుండి అమలులోకి వచ్చింది. అబుదాబిలోని ఆరోగ్య శాఖ అబుదాబిలోని ఆరోగ్య కార్యకర్తలకు కూడా ఇదే విధమైన ఆదేశాలను జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com