చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య తగాదా విషాదానికి దారి...
- March 28, 2016
రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య తగాదా విషాదానికి దారి తీసింది. ఈ గొడవలో ఓ వ్యక్తి మరణించినట్లు స్థానికంగా వెలుగు చూసింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.పోలీసుల కథనం ఆధారంగా స్థానిక మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. కర్ణాటకలోని బళ్లారి ఆ సంఘటన జరిగింది. బళ్లారి నగరంలోని కౌల్ బజార్కు చెందిన ఇద్దరు యువకులు ఈ నెల 20వ తేదీన ఓ చోట కలిశారు. వీరిలో ఒకతను పవన్ కల్యాణ్ అభిమాని కాగా, మరొకతను చిరంజీవి అభిమాని.చిరంజీవి అభిమాని మరో వ్యక్తితో వాదనకు దిగాడు. తమ అన్న మెగాస్టార్ను మించిన హీరో ఎవరూ లేరని వాదించాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఇది కాస్తా దాడికి దారి తీసింది. చిరంజీవి అభిమాని పవన్ కల్యాణ్ అభిమానిని ఇనుప రాడ్తో కొట్టాడు. దీంతో పవన్ కల్యాణ్ అభిమాని అక్కడికక్కడే మరణించాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







