రాష్ట్ర ఉగాది వేడుకలు విజయవాడలో..
- March 28, 2016
విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో ఏప్రిల్ 8న రాష్ట్రస్థాయి ఉగాది పర్వదిన వేడుకల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగిన ఉద్ధండ్రాయునిపాలెంలో వీటిని నిర్వహించాలని మొదట్లో భావించిన సర్కారు.. వేదికను విజయవాడకు మారుస్తూ ఆదివారం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మనుమడు దేవాన్ష్ బర్త్‌డే వేడుకలనూ ఇదే వేదికపై నిర్వహిస్తామని సీఎం ప్రకటించడంతో ఉగాది వేడుకల వేదికను భద్రత దృష్ట్యా విజయవాడకు మార్చినట్లు సమాచారం. గతేడాది ప్రభుత్వం ఉగాది వేడుకలు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో నిర్వహించింది.ఈసారి కూడా అమరావతిలోనే రైతుల మధ్య నిర్వహించాలనుకున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కూ సూచనలందాయి.ఉద్ధండ్రాయునిపాలెంలో నిర్వహించడం వల్ల రోడ్లు, హెలీప్యాడ్లు, పార్కింగ్ సమస్యలు ఉండబోవనీ,ఏర్పాట్లకు అయ్యే ఖర్చు తగ్గుతుందని సర్కారు భావించింది. అయితే ఉగాది రోజున పుట్టిన తన మనుమడు దేవాన్ష్ బర్త్‌డేను ఉగాది వేడుకల్లోనే నిర్వహిస్తామని శనివారం సీఎం ప్రకటించడంతో మార్పు జరిగింది. 60 మందికి కళారత్న, ఉగాది పురస్కారాలు.. ఉగాది వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కళారత్న (హంస), పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.16 రంగాలకు చెందినవారినిఎంపిక చేసి వీటిని అందజేస్తారు. ఇందుకోసం రెండ్రోజుల్లో అవార్డుల ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







