టాటాల చేతుల్లోకి ఎయిరిండియా.. ముహూర్తం ఖరారు
- January 24, 2022
న్యూ ఢిల్లీ: ఎయిర్ ఇండియా పూర్తిగా టాటాల పరం కానుంది.ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. 2022, జనవరి 27వ తేదీన ఎయిరిండియా పూర్తిగా టాటాల పరం కానుంది.సంస్థకు సంబంధించిన నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం టాటా గ్రూప్ నకు అప్పగించనున్నట్లు తెలిపింది. జనవరి 27వ తేదీ నుంచి ఎయిరిండియా నిర్వహణ టాటాలు అందుకోవడం జరుగుతుందని ఎయిరిండియా డైరెక్టర్ (ఫైనాన్స్) వినోద్ హెజ్మాది సిబ్బందికి ఈ మెయిల్ ద్వారా తెలియచేశారని తెలుస్తోంది. ఎయిరిండియాతో రాకతో టాటా గ్రూప్ లోకి మూడో విమానాయన బ్రాండ్ వచ్చినట్లవుతుంది. ఇప్పటికే విస్తారా, ఎయిరేషియా ఇండియాలో టాటా సంస్థకు మెజార్టీ వాటాలున్న సంగతి తెలిసిందే.
ఎయిరిండియా మొత్తం అప్పుల ఊబిలో కూరుకపోయింది. దీంతో 100 శాతం వాటాలు పొందేందుకు రూ. 18 వేల కోట్లతో టాటాలకు చెందిన ప్రత్యేక సంస్థ టాలెస్ ప్రైవేటు లిమిటెడ్ బిడ్ దాఖలు చేసింది. గత సంవత్సరం అక్టోబర్ 08వ తేదీన కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అదే నెల 11వ తేదీన ఈ బిడ్డింగ్ ను ధృవీకరిస్తూ..కేంద్రం లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను సైతం జారీ చేసింది. ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ మిగిలి ఉందని, ఇది…రెండు, మూడు రోజుల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ నెలాఖరులోపు…ఎయిరిండియా పూర్తిగా టాటాల పరం కానున్నాయి. ఎయిర్ ఇండియా అసలు పేరు టాటా ఎయిర్ లైన్స్. 1932లో టాటా ఎయిర్ లైన్స్ ను పారిశ్రామిక దిగ్గజం JRD టాటా స్ధాపించగా, స్వాతంత్ర్యం అనంతరం కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయీకరణ చేసింది. దీని పేరును ఎయిర్ ఇండియాగా మార్చింది. 68 ఏళ్ల తర్వాత మళ్లీ ఎయిరిండియా టాటా చేతికొచ్చింది.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







