భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- January 26, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం దేశంలో 2,55,874 కరోనా కేసులు నమోదు కాగా.. బుధవారం మాత్రం 2,85,914 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా మరణాలు కూడా పెరిగాయి. మంగళవారం 614 మంది మృతి చెందగా… బుధవారం 665 మంది కరోనాతో మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,00,85,116కి చేరింది. కరోనా మరణాల సంఖ్య 4,91,127కి పెరిగింది.
గడిచిన 24 గంటల్లో 2,99,073 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీల సంఖ్య 3,73,70,971కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 22,23,018గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 59,50,731 మందికి కరోనా వ్యాక్సిన్లు వేశామని… ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,63,58,44,536 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 16.16గా ఉందని కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







