తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు
- January 26, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా భయపెట్టిస్తోంది. తగ్గిపోతుందని అనుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. చలికాలంలో వైరస్ పంజా విసురుతోంది. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వరంతో బాధ పడుతున్నారు. దీంతో టెస్టింగ్ ల సంఖ్య రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అంతేగాకుండా..రాష్ట్రంలో ఫీవర్ సర్వే కూడా చేపట్టింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. గత 24 గంటల్లో 3 వేల 801 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, ఒక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. అలాగే…ఒక్కరోజులో 2 వేల 046 మంది ఆరోగ్యవంతంగా కోలుకున్నారని..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,05,054 ఉందని పేర్కొంది.
జిల్లాల వారీగా కేసులు: ఆదిలాబాద్ 43, భద్రాద్రి కొత్తగూడెం 78, జీహెచ్ఎంసీ 1570, జగిత్యాల 55, జనగాం 48, జయశంకర్ భూపాలపల్లి 29, జోగులాంబ గద్వాల 24, కామారెడ్డి 35, కరీంనగర్ 79, ఖమ్మం 139, కొమురం భీమ్ ఆసిఫాబాద్ 17, మహబూబ్ నగర్ 86, మహబూబాబాద్ 44, మంచిర్యాల 67, మెదక్ 27, మేడ్చల్ మల్కాజ్ గిరి 254, ములుగు 28, నాగర్ కర్నూలు 38, నల్గొండ 70, నారాయణపేట 25, నిర్మల్ 22, నిజామాబాద్ 62, పెద్దపల్లి 51, రాజన్న సిరిసిల్ల 31, రంగారెడ్డి 284, సంగారెడ్డి 88, సిద్ధిపేట 96, సూర్యాపేట 59, వికారాబాద్ 39, వనపర్తి 40, వరంగల్ రూరల్ 75, హన్మకొండ 147, యాదాద్రి భువనగిరి 51. మొత్తం : 3,801
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







