శ్రీవారి భక్తులకు శుభవార్త
- January 26, 2022
తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లను ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. 28వ తేదీన ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు టీటీడీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28వ తేదీన ఉదయం 9 గంటలకు రోజుకు 12 వేల చొప్పున టికెట్లు జారీ చేయనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఈ నెల 29వ తేదీన రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఫిబ్రవరి నెలలో దర్శనం టికెట్లను పెంచుతారని అంతా ఆశించారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో దర్శనం టికెట్లను పెంచలేదని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. లేదంటే తిరుమలలోకి ఎంట్రీ ఉండదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఆలయంలోనూ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. కరోనా కట్టడికి తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు.
తాజా వార్తలు
- కార్టూనిస్ట్ శ్రీధర్ కు కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టిన ఏపీ ప్రభుత్వం
- ప్రపంచ AI హబ్‌గా భారత్..
- ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం
- చిరుత సంచారం..ప్రజల్లో భయాందోళనలు
- మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’..తొలుత ఇచ్చేది వారికే!
- సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు
- గ్యాస్ లీకేజీల పై సౌదీ సివిల్ డిఫెన్స్ వార్న్..!!
- విశాఖలో ఇంటర్నేషనల్ మారిటైమ్ రివ్యూ.. పాల్గొన్న ఒమన్..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తి మృతి..తీర్పు వెల్లడి..!!
- ఇఫ్తార్ పై సోషల్ మీడియా వదంతులను ఖండించిన కువైట్..!!









