భారత్ కరోనా అప్డేట్
- January 27, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 2,86,384 కేసులు నమోదవ్వగా, 573 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,06,357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు కాస్త పెరగడం ఊటరనిచ్చేవిషయం. ఇక దేశంలో 22,02,472 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 19.59శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 163,84,39,207 మందికి వ్యాక్సినేషన్ అందించారు. మూడో డోస్ కొనసాగుతోంది.
దేశంలో వీలైనంత త్వరగా రెండో డోసు కార్యక్రమం పూర్తి చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ప్రస్తుతం హెల్త్ వర్కర్లు, కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్, 60 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఆరోగ్యసమస్యలు ఉన్న వారికి వైద్యుల సలహా మేరకు ప్రైవేటులో మూడో డోసు అందిస్తున్నారు. థర్డ్ వేవ్ ఉధృతి అధికంగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉండటంతో కరోనా బారిన పడినా త్వరగా కోలుకుంటున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి