రిఫైనరీ అగ్ని ప్రమాదంలో మరో ఇద్దరు భారతీయులు మృతి

- January 27, 2022 , by Maagulf
రిఫైనరీ అగ్ని ప్రమాదంలో మరో ఇద్దరు భారతీయులు మృతి

కువైట్: కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ మినా అల్-అహ్మదీ రిఫైనరీలో గ్యాస్ లిక్విఫాక్షన్ యూనిట్‌లో జనవరి 14న జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఇండియన్స్ సంఖ్య 4కి చేరుకుంది. ఆ ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు భారతీయ కార్మికులు చికిత్స పొందుతూ మరణించారు. మినా అల్-అహ్మదీ రిఫైనరీలో గ్యాస్ లిక్విఫాక్షన్ యూనిట్ అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించగా.. 10 మంది కార్మికులు గాయపడిన విషయం తెలిసిందే. గాయపడ్డ వారిలో 5 మంది కార్మికులు అల్-అదాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో ముగ్గురు కార్మికులు రిఫైనరీ క్లినిక్‌లో చికిత్స పొందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com