60 ఏళ్లు పైబడిన వారికి వర్క్ పర్మిట్లు

- January 27, 2022 , by Maagulf
60 ఏళ్లు పైబడిన వారికి వర్క్ పర్మిట్లు

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో 60 ఏళ్లు పైబడిన రెసిడెంట్స్ తమ వర్క్ పర్మిట్‌లను పునరుద్ధరించుకొని ఉపాధి పొందవచ్చు. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం.. ప్రయివేటు రంగంలోని ప్రవాస కార్మికులు 60 ఏళ్ల తర్వాత కూడా తమ వర్క్ పర్మిట్లను పునరుద్ధరించుకొని, ఉపాధి పొందవచ్చు. వయస్సు మినహాయింపుల కోసం పెద్ద సంఖ్యలో ప్రైవేట్ రంగం నుంచి రిక్వెస్టులు వచ్చాయని, వారి అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని 60 ఏళ్లు పైబడిన ప్రవాస సిబ్బందిని తీసుకురావడానికి లైసెన్స్ లను పునరుద్ధరించడానికి, ప్రైవేట్ రంగంలోని కార్మికుల 60 ఏళ్ల వయస్సు పరిమితిని రద్దు చేయాలని నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖలోని కార్మిక శాఖ అండర్ సెక్రటరీ షేక్ నాసర్ అల్ హోసానీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com