తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- January 27, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు.రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. వివిధ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.బుధవారం 3 వేల 801 పాజిటివ్ కేసులు ఉంటే.. గత 24 గంటల్లో 3 వేల 944 కేసులు నమోదయ్యాయని, ముగ్గురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 39 వేల 520 యాక్టివ్ కేసులుండగా..మొత్తం 4 వేల 081 మంది చనిపోయారని పేర్కొంది. అలాగే…ఒక్కరోజులో 2 వేల 444 మంది ఆరోగ్యవంతంగా కోలుకున్నారని..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,07,498 ఉందని పేర్కొంది.
జిల్లాల వారీగా కేసులు :
ఆదిలాబాద్ 40, భద్రాద్రి కొత్తగూడెం 101, జీహెచ్ఎంసీ 1372, జగిత్యాల 67, జనగాం 40, జయశంకర్ భూపాలపల్లి 42, జోగులాంబ గద్వాల 40, కామారెడ్డి 43, కరీంనగర్ 80, ఖమ్మం 135, కొమురం భీమ్ ఆసిఫాబాద్ 19, మహబూబ్ నగర్ 79, మహబూబాబాద్ 45, మంచిర్యాల 76, మెదక్ 60, మేడ్చల్ మల్కాజ్ గిరి 288, ములుగు 26, నాగర్ కర్నూలు 59, నల్గొండ 91, నారాయణపేట 12, నిర్మల్ 41, నిజామాబాద్ 105, పెద్దపల్లి 95, రాజన్న సిరిసిల్ల 48, రంగారెడ్డి 259, సంగారెడ్డి 120, సిద్ధిపేట 104, సూర్యాపేట 66, వికారాబాద్ 56, వనపర్తి 64, వరంగల్ రూరల్ 78, హన్మకొండ 117, యాదాద్రి భువనగిరి 76. మొత్తం : 3,944
తాజా వార్తలు
- యూఏఈ: లైసెన్స్ లేని సంస్థల నుండి గృహ కార్మికులను నియమించుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు
- సీఎం కేసీఆర్తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ