డ్రగ్స్‌పై ముగిసిన తెలంగాణ డీజీపీ సమీక్ష..
- January 28, 2022
హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంపై మళ్లీ ఫోకస్ పెట్టారు తెలంగాణ పోలీసులు.ఇవాళ డ్రగ్స్ పై డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జంట నగరాల పోలీస్ కమిషనర్లతో పాటు జిల్లా ఎస్పీలు హాజరయ్యారు.డ్రగ్స్ నియంత్రణకు 1000 మందితో ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే కాగా..ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు డీజీపీ..ఇక, సీఎంతో పోలీసులు,ఎక్సైజ్ అధికారులతో హై లెవల్ మీటింగ్ జరగనుంది.డ్రగ్స్ విక్రేతలు, వాడకందారులపై తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ సమావేశంలో చర్చ జరిగింది.
ఇక, డీజీపీ నిర్వహించిన సమావేశంలో కీలక ప్రతిపాదనలు సిద్ధం చేశారు.డ్రగ్స్ అమ్మకందారులు, వినియోగదారుల చిట్టా తయారు చేసింది పోలీసుశాఖ.. గతంలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ల పేర్లతో చిట్టా సిద్ధం అయ్యింది.సినీ,రాజకీయ, వ్యాపార వేత్తలు, విద్యార్థుల సంబంధించిన పేర్లతో చిట్టా సిద్ధం అయినట్టుగా పోలీసులు ఉన్నతాధికారులు చెబుతున్నారు.డ్రగ్స్ తో పాటుగా గంజాయి తీసుకున్న వారి వివరాలను కూడా పోలీసుశాఖ పొందుపర్చింది.మరోవైపు డ్రగ్స్ విక్రయాలపై నిరంతర నిఘాకు కొత్త యాప్‌ను రూపొందించారు.ఆ యాప్ లో డ్రగ్స్ విక్రయదారుల సంబంధించిన పూర్తి సమాచారంతో అందుబాటులో ఉంచనున్నారు.డ్రగ్స్ కు సంబంధించి గత పదేళ్లకు సంబంధించిన పూర్తి డేటాను తయారు చేసింది పోలీసుశాఖ.. ఇక, సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశంలో వీటిపై చర్చ సాగనుంది.కానీ, కేసీఆర్ సమీక్షలో ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







