పద్మశ్రీ మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా
- January 28, 2022
హైదరాబాద్: పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్యను తెలంగాణ సీఎం కేసీఆర్ ఘనంగా సత్కరించారు. ఆయనకు భారీ నజరానా ప్రకటించారు. హైదరాబాద్ లో ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణ ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయల రివార్డ్ ప్రకటించారు కేసీఆర్. ఇటీవల దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డు అందుకున్న దర్శనం మొగులయ్య శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా మొగులయ్యను శాలువాతో సత్కరించారు కేసీఆర్.
తెలంగాణ గర్వించ దగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగులయ్య అభినందనీయుడు అని కేసీఆర్ అన్నారు. మొగులయ్యకు పద్మశ్రీ పురస్కారం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మొగులయ్యకు ఇంటి స్థలం, నగదు పురస్కారం ప్రకటించిన కేసీఆర్.. ఇందుకు సంబంధించి మొగులయ్యతో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆదేశించారు. ఇప్పటికే మొగులయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని, గౌరవ వేతనాన్ని కూడా అందిస్తోందని సీఎం తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ, కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని కేసీఆర్ మరోసారి చెప్పారు.
తర తరాల నుంచి వచ్చిన ఆస్తిని కాపాడుకోవాలన్న తాపత్రయం చాలా మందికి ఉంటుంది. కానీ తాత ముత్తాల నుంచి వస్తున్న కళని కాపాడుకోవాలని తపన పడ్డాడు మొగులయ్య. అదే ఆయనకు పద్మశ్రీని తెచ్చిపెట్టింది. 12 మెట్ల కిన్నెరను వాయించడంలో మొగులయ్య నేర్పరి. దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. పూట గడవని జీవితం. దుర్భర దారిద్ర్యం. భార్య, 9మంది పిల్లలను పోషించడం కోసం చాలా కష్టాలు పడ్డాడు.
దర్శనం మొగులయ్యది నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట. 12 మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆయన ఆఖరి తరం కళాకారుడు. కిన్నెరమెట్ల కళ అత్యంత అద్భుతమైందన్న మొగులయ్య.. ఈ కళ నాతోనే అంతమవుతుందా అనే మనోవేదనతో ఉన్న సమయంలో.. పద్మశ్రీ పురస్కారం వచ్చిందన్నారు. దీని ద్వారా తన కళకు జీవం పోశారన్నారు. సీఎం కేసీఆర్ ఈ కళను గుర్తించి, పురస్కారాన్ని ఇవ్వడంతో అందరికీ తెలిసిందని చెప్పుకొచ్చారు. కాగా, మొగిలయ్య.. 12 మెట్ల కిన్నెరను వాయిస్తుంటే అందరూ మైమరచిపోవాల్సిందే. ప్రాచీన సంగీత వాయిద్యం కిన్నెరనే బతుకుదెరువుగా మలుచుకున్న కళాకారుడు మొగులయ్య.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







