హైదరాబాద్: రూ.2,200 కోట్లకు పైగా మోసం..
- January 29, 2022
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగు చూసింది. ఆన్లైన్ గేమింగ్, పెట్టుబడుల పేరుతో భారీ చీటింగ్ జరిగినట్లు ఆర్వోసి గుర్తించింది. ఇప్పటివరకు మొత్తం 2, 200 కోట్లకుపైగా మోసం జరిగినట్లు నిర్ధారించింది. ఈ మోసాలకు పాల్పడిన 13 బోగస్ సంస్థలపై ఫిర్యాదు చేసింది. కంపెనీ డైరెక్టర్లు, ఛైర్మన్, ప్రమోటర్లపై ఫిర్యాదు చేసింది. నకిలీ పత్రాలతో అనుమతులు తీసుకుని కంపెనీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మాల్ 008, మాల్ 98, వైఎస్ 0123, రిబేట్ యాప్స్ పేరుతో మోసాలు చేసినట్లు .. 2వేల 200 కోట్ల రూపాయలను హాంకాంగ్‌కు తరలించినట్లు గుర్తించారు. ఈ నకిలీ కంపెనీల ఏర్పాటు వెనుక చైనా కేటుగాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేయగా.. చైనీయులకు సహకరించిన ఇద్దరిని పట్టుకునేందుకు సీసీఎస్ ప్రయత్నాలు చేస్తోంది. హవాలా మార్గంలో డబ్బులు తరలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







