విగ్గులో బంగారం పట్టివేత...
- February 02, 2022
చెన్నై: చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున బంగాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఓ మహిళ వేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది.విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ తనిఖీల్లో 23 లక్షల విలువైన బంగారం పట్టుబడింది.
ఓ మహిళ తల విగ్గులో బంగారం దాచి గుట్టుగా బయటపడదామని ప్లాన్ చేసింది.అయితే కస్టమ్స్ అధికారుల ముందు ఆమె ఆటలు సాగలేదు.విగ్గులో దాచిన బంగారం స్వాధీనం చేసుకున్నారు చెన్నై కస్టమ్స్ అధికారులు.శ్రీలంక నుంచి చెన్నైకి విమానంలో తలవెంట్రుకల్లో విగ్గులో దాచుకున్న 23 లక్షల విలువైన 525 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు అధికారులు. ఈ కేసుకి సంబంధించి ముగ్గురు మహిళలను చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. వీరి వెనుక ఎవరు ఉన్నారనేది తెలుసుకునేందుకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి