ముంబైలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత

- February 02, 2022 , by Maagulf
ముంబైలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత

ముంబై: క‌రోనా ఉథృతి త‌గ్గుతోంది. దాంతో ప‌లు రాష్ట్రాల్లో విధించిన క‌రోనా ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్నాయి రాష్ట్ర ప్ర‌భుత్వాలు. కాగా మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబ‌యిలో కూడా నైట్ క‌ర్ఫ్యూని విధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ముంబ‌యిలో క‌రోనా కేసులు త‌గ్గుతోన్న నేప‌థ్యంలో నైట్ క‌ర్ఫ్యూని ఎత్తివేశారు. క‌రోనా ఆంక్ష‌ల‌ను కూడా స‌డ‌లించారు. ఈ మేర‌కు నేటి నుంచే న‌గ‌రంలో రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, థీమ్ పార్క్ లకు అనుమ‌తి ఇచ్చారు. కానీ 50 శాతంతో సామ‌ర్థ్యంతోనే న‌డిపించాల‌ని నిబంధ‌న‌ను పెట్టారు. అలాగే బీచ్ ల‌తో పాటు పార్కులు, ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను గ‌తంలో లాగే తెరుచుకోనున్నాయి. అయితే అంద‌రూ మాస్క్ ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పెట్టుకోవాల‌ని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com