విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ బోధనపై హైకోర్టు కీలక ఆదేశాలు

- February 03, 2022 , by Maagulf
విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ బోధనపై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు సూచనలు జారీ చేసింది.

విద్యా సంస్థల్లో ఆన్ లైన్ బోధన కొనసాగించాలని, 20వ తేదీ వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు..ఆన్ లైన్ బోధన ఉండే విధంగా చూడాలని సూచించింది. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్న మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ధ కోవిడ్ నిబంధనలు అయలయ్యేలా చూడాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రశ్నించింది. త్వరలో జరగబోయే సమ్మక్క జాతరలో కోవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని వెల్లడించింది. ప్రస్తుతం ముచ్చింతల్ లో జరుగుతున్న సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కూడా నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఏజీకి తెలిపింది. నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేసింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ..తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది హైకోర్టు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com