శ్రీజ, కళ్యాణ్‌లు కలిసి స్టెప్పులు
- March 29, 2016
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం నిన్న బెంగళూర్‌లోని ఫామ్ హౌస్ లో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్ళి తర్వాత ఈ దంపతులు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారట. అయితే ఈ పెళ్లి వేడుకను ఐదు రోజుల పండుగగా నిర్వహించగా మెహందీ, సంగీత్ ఫంక్షన్‌లలో మెగా ఫ్యామిలీ చాలా సందడి చేసినట్టు తెలుస్తుంది. శ్రీజ కుటుంబ సభ్యులతో పాటు కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో చిరంజీవి నటించిన సినిమాల్లోని 20 పాటలకు కొత్త దంపతులు కాలు కదిపినట్టు టాక్. అంతేకాక ఇదే వేడుకలో చిరు తన పెద్ద కూతురు సుస్మితతో 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' అనే పాటకు స్టెప్పులేసారు.మెహందీ వేడుకకు అఖిల్, రానా ,దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు స్పెషల్ గెస్టులుగా హాజరయ్యారు. వీరితో పాటు కన్నడ నటి సుమలత, ఆమె భర్త అంబరీష్ కూడా వేడుకలో పాల్గొన్నారు. మెహందీ ఫంక్షన్‌ని ఎంతో గ్రాండ్‌గా నిర్వహించిన మెగా ఫ్యామిలీ వచ్చిన అతిధులని కూడా ఫుల్ ఎంటర్‌టైన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ మెగా వేడుకలో శ్రీజ, కళ్యాణ్‌లు కలిసి స్టెప్పులు వేసిన ఓ వీడియోతో పాటు చిరు వీడియో కూడా బయటకు వచ్చింది. దానిపై మీరు ఓ లుక్కేయండి
తాజా వార్తలు
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి







