ప్రయాణ నిబంధనలు సడలించిన యూఏఈ
- February 05, 2022
యూఏఈ: పూర్తి డోసుల వ్యాక్సిన్ తీసుకున్న సిటిజన్స్ కు ట్రావెల్ నిబంధనలను సడలించారు. 12 ఆఫ్రికన్ దేశాలతో సహా గతంలో ట్రావెల్ బ్యాన్ విధించిన అన్ని దేశాలకు ప్రయాణించవచ్చు. ఈ మేరకు జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జిసిఎఎ), నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్సిఇఎంఎ) వెల్లడించింది. కొత్త నిబంధనలు ఫిబ్రవరి 6 (ఆదివారం) నుండి అమల్లోకి రానున్నాయి. నిబంధనలు సడలించిన ఆఫ్రికా దేశాల్లో కెన్యా, టాంజానియా, ఇథియోపియా, నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దక్షిణాఫ్రికా, బోట్స్వానా, ఎస్వాటిని, లెసోతో, మొజాంబిక్, నమీబియా, జింబాబ్వే ఉన్నాయి. అయితే వ్యాక్సిన్ తీసుకోని (మెడికల్ మినహాయింపు) ఉన్నవారి మాత్రం సామాజిక దూరం, మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం లాంటి కొవిడ్-19 నియంత్రణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







