గూగుల్ క్రోమ్ యూజర్లకు హెచ్చరిక..
- February 10, 2022
ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగించేది గూగుల్ క్రోమ్. అయితే గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడే వారికి కేంద్ర సర్కార్ మరో హెచ్చరిక జారీ చేసింది. గూగుల్ బ్రౌజర్ లో కొన్ని లోపాలున్నాయని ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ లోపాల కారణంగా యూజర్లను హ్యకర్లు సులభంగా దాడి చేసే అవకాశం ఉందని తెలిపింది. ఆర్బిట్రరీ కోడ్‌ను ఉపయోగించుకుని హ్యాకర్స్ గూగుల్ క్రోమ్ ద్వారా ఆయా ఫోన్లలోకి, కంప్యూటర్లలోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపింది. దీని వల్ల డేటా మొత్తం తస్కరించే అవకాశం ఉందని సూచించింది.
గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో కొన్ని కేటగిరిల్లో లోపాలు ఉన్నట్లు టీమ్ గుర్తించింది. యూజ్ ఆఫ్టర్ ఫ్రీ ఇన్ సేఫ్ బ్రౌజింగ్, రీడర్ మోడ్, వెబ్ సెర్చ్, థంబ్‌నెయిల్ ట్యాబ్ స్ట్రిప్, స్క్రీన్ క్యాప్చర్, విండో డైలాగ్, పేమెంట్స్, ఎక్స్టెన్షన్స్, యాక్సెసిబిలిటీ అండ్ క్యాస్ట్ స్క్రీన్, పూర్తి స్క్రీన్ మోడ్, స్క్రోల్, ఎక్స్టెన్షన్స్ ప్లాట్‌ఫారమ్ అండ్ పాయింటర్ లాక్, అలాగే COOPలో పాలసీ బైపాస్, వీ8లో అవుట్ ఆఫ్ బౌండ్స్ మెమరీ యాక్సెస్కాప్చర్స్ వంటి తదితర లోపాలున్నాయని తెలియజేసింది. ఈ కారణంగా సైబర్ నేరగాళ్లు గూగుల్ క్రోమ్ యూజర్ల డేటాను దొంగిలించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక క్రోమ్ 98 వెర్షన్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. గూగుల్ క్రోమ్ వెర్షన్ 98.0.4758.80 కంటే ముందు వెర్షన్ వాడుతున్న వాళ్లు మాత్రం వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







