సీఎం జగన్ ను కలిసిన సినీ ప్రముఖులు..నెలాఖరున కొత్త జీవో వస్తుందన్న చిరంజీవి
- February 10, 2022
గురువారం (ఫిబ్రవరి 10) రోజున టాలీవుడ్‌కి చెందిన సినీ ప్రముఖులు చిరంజీవి, ప్రభాస్, మహేష్, రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణ మూర్తి, పోసాని కృష్ణమురళి, నిరంజన్ రెడ్డి, అలీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌ను కలిశారు. గురువారం ఉదయం పది గంటలకు ప్రత్యేక విమానం గన్నవరం చేరుకుని అటు వంటి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి వారు జగన్‌తో భేటీ అయ్యారు. మీటింగ్ అనంతరం అక్కడున్న మీడియాతో చిరంజీవి మాట్లాడారు.
‘‘సినిమా టికెట్ ధరలకు సంబంధించి శుభం కార్డు పడినట్టే. అలాగే ఏపీలో చిన్న సినిమాలకు సంబంధించి ఐదవ షోకు అనుమతి ఇవ్వడం కూడా శుభపరిణామం. మీటింగ్ ముగిసింది. ఈ నెలాఖరున సమస్యల పరిష్కారానికి సంబంధించిన జీవో వస్తుందని భావిస్తున్నాం’’ అని చిరంజీవి తెలిపారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని చొరవతో సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం దొరికినట్లయ్యిందన్నారు చిరంజీవి.
హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధి జరిగినట్లే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇండస్ట్రీ అభివృద్ది జరగాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పడం గొప్ప విషయం. అంతే కాకుండా సినీ పరిశ్రమ ఏపీలో అభివృద్ధి పడటానికి తన వంతుగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా జగన్ చెప్పినట్లు చిరంజీవి తెలిపారు. అలాగే మా వంతు సపోర్ట్ చేయడానికి మేం సిద్ధం. సామరస్యంగానే ముందుకు వెళతాం. కమిటీ వారు కూడా న్యాయ బద్దంగా ఫైనల్ డ్రాఫ్ ఇచ్చారు. ఫిబ్రవరి మూడో వారంలోపు జీవో వస్తుందని అనుకుంటున్నాం.
ఇదే క్రమంలో ప్రభాస్, మహేష్ మాట్లాడుతూ తమకు దారి చూపించి ముందుకు నడిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. చాలా రిలీఫ్‌గా ఉందని, జగన్‌కు, పేర్ని నానికి వారు థాంక్స్ చెప్పారు.b
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!