రిటెయిల్ షాప్ బిల్ బోర్డులో ఇరుక్కుపోయిన వ్యక్తిని రక్షించిన అధికారులు
- February 11, 2022
దుబాయ్: నైఫ్ పోలీస్ స్టేషన్, జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ రెస్క్యూ మరియు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ సంయుక్తంగా ఓ ఆఫ్రికా జాతీయుడ్ని రక్షించడం జరిగింది. బాధితుడు ఓ రిటెయిల్ స్టోర్‌లోని బిల్ బోర్డులో ప్రమాదవశాత్తూ ఇరుక్కుపోయాడు. తన ఫ్లాట్ మేట్స్‌తో వివాదం కారణంగా బాధిత వ్యక్తి, ఫస్ట్ ఫ్లోర్‌లోని బాత్రూమ్ విండో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బిల్ బోర్డులో పడిపోయాడు. స్టోర్ యజమాని విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో, సకాలంలో అక్కడికి చేరుకున్న రక్షణ సిబ్బంది బాధితుడ్ని బయటకు తీశారు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్య చికిత్స అందించారు.
తాజా వార్తలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం







