స్మగ్లింగ్ ప్రయత్నాలను భగ్నం చేసిన సౌదీ కస్టమ్స్
- February 12, 2022
సౌదీ: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్, దుబా పోర్ట్ ల ద్వారా దేశంలోకి 2,483,926 యాంఫెటమైన్ ట్యాబ్లెట్లను అక్రమంగా తరలించేందుకు చేసిన ప్రయత్నాలను సౌదీ కస్టమ్స్ అడ్డుకుంది. జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ లో గ్లోవ్ బాక్సుల్లో దాచిన 2,060,000 యాంఫెటమైన్ ట్యాబ్లెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZATCA) తెలిపింది. అలాగే ఎర్ర సముద్రం ఓడరేవు ద్వారా దుబా పోర్ట్ కు వచ్చిన ట్రక్కు స్పేర్ టైర్‌లో దాచిన 423,926 ట్యాబ్లెట్‌లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్‌తో సమన్వయంతో ఈ నేరాలకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు ZATCA వివరించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేక పోరాటంలో సహకరించాలని అథారిటీ పిలుపునిచ్చింది. 1910కి కాల్ చేయడం ద్వారా.. [email protected] ఈ-మెయిల్ ద్వారా లేదా అంతర్జాతీయ నంబర్ 00966114208417 కు సమాచారం అందివ్వాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







