ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన క్రౌన్ ప్రిన్స్, బ్రిటన్ ప్రధాని
- February 12, 2022
సౌదీ: క్రౌన్ ప్రిన్స్, బ్రిటన్ ప్రధానిలు పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఉప ప్రధాని, రక్షణ మంత్రి క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ కు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు, వివిధ రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ఉన్న అవకాశాలపై ఇరువురు సమీక్షించారు. ఉమ్మడిగా ఆసక్తి ఉన్న పలు అంశాలపై క్రౌన్ ప్రిన్స్, బ్రిటన్ ప్రధాని చర్చించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరం పెడుతున్న కరోనా మహమ్మారిపై కూడా వారు చర్చించారు. ఈ సందర్భంగా సౌదీ చేపట్టిన కొవిడ్ నియంత్రణ చర్యలను బ్రిటన్ ప్రధాని ప్రశంసించారు. ప్రపంచ వాణిజ్యంపై కరోనా ప్రభావంపై ఇరు దేశాల నేతలు తమ అభిప్రయాలను పంచుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై క్రౌన్ ప్రిన్స్, బ్రిటన్ ప్రధానిలు చర్చించారు.
తాజా వార్తలు
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు







