మార్చి నాటికి ఫ్యామిలీ, విజిట్ వీసాల జారీ
- February 13, 2022
కువైట్: దేశంలో ఇన్ఫెక్షన్ల సంఖ్య ఇటీవల తగ్గిన నేపథ్యంలో మార్చి నాటికి ఫ్యామిలీ విజిట్, టూరిస్ట్ విజిట్ వీసాలను జారీ చేయాలని అంతర్గత మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అయితే దేశంలో "కరోనా" మహమ్మారికి సంబంధించిన తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి నివేదిక అందాల్సి ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని నివాస వ్యవహారాల విభాగం తెలిపింది. ఆ నివేదికి రాగానే వీసాల జారీ అంశాలను పరిశీలించనున్నట్లు పేర్కొంది. ప్రవాసుల కోసం అన్ని రకాల వీసాలను జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ, కరోనా నేపథ్యంలో ఫ్యామిలీ, టూరిస్టు వీసాల జారీని తాత్కలికంగా నిలిపివేశారు. మరోవైపు కేబినెట్ నిర్ణయం ప్రకారం ఇప్పటికే వర్క్ వీసాలు, కమర్షియల్ వీసాల జారీని పునరుద్ధరించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







