ఏపీ కరోనా అప్డేట్

- February 13, 2022 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 22వేల 785 కరోనా టెస్టులు చేయగా.. 749 మందికి పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది. మరో ముగ్గురు కోవిడ్ తో చనిపోయారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఒకొక్కరు చొప్పున కరోనాతో మరణించారు.గడిచిన 24 గంటల వ్యవధిలో 6వేల 271 మంది కరోనా నుంచి కోలుకున్నారు.నేటి వరకు రాష్ట్రంలో 3,28,31,785 కరోనా టెస్టులు చేశారు.ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14,697 కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,12,778. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,79,152. రాష్ట్రంలో ప్రస్తుతం 18వేల 929 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, శనివారంతో(896 కేసులు, 6 మరణాలు) పోలిస్తే ఆదివారం కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com