మొబైల్ బస్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ప్రారంభం

- February 14, 2022 , by Maagulf
మొబైల్ బస్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ప్రారంభం

ఒమన్: రెండువారాలపాటు కొనసాగనున్న మొబైల్ బస్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ప్రారంభమైంది. డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, ఆస్టర్ అల్ రఫా హాస్పిటల్ సహకారంతో మస్కట్ గవర్నరేట్‌లో ఈ సర్వీసును ప్రారంభించారు. ఈ బస్సు పలు ప్రాంతాల్లో పర్యటించి సిటిజన్స్/రెసిడెంట్స్ లకు కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అందజేస్తుందని మస్కట్ గవర్నరేట్‌లోని డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌లోని డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ లామియా బింట్ హుస్సేన్ అల్ బలూషియా చెప్పారు. అల్ మబెల్లా సౌత్‌లోని మస్కట్ మాల్ లో రెండు రోజుల పాటు సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఫిబ్రవరి 24 వరకు బుషర్, ముత్రా, మస్కట్, అల్ అమెరత్‌లోని విలాయత్‌లలో కూడా ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుందని అల్ బలూషియా తెలిపారు. మొబైల్ బస్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ముఖ్యంగా బూస్టర్ డోస్‌ను(మూడో డోస్) పెంచడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com